భారతదేశం, మే 22 -- సీనియర్ డైరెక్టర్ రామ్‍గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి వివాదాస్పద కామెంట్ చేశారు. టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా టీజర్ ఇటీవలే వచ్చింది. ఈ టీజర్‌లో హీరోయిన్ కియారా అడ్వానీ బికినీ లుక్‍లో కనిపించారు. ఇది బాగా వైరల్ అయింది. అయితే, ఈ బికినీపై అభ్యంతరకరంగా రియాక్ట్ అయ్యారు ఆర్జీవీ. దీంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

కియారా అడ్వానీ బికినీపై ఆర్జీవీ ట్వీట్ చేశారు. "దేశాలు, సొసైటీల కోసం కాకుండా.. ఈ బ్యా* ఎవరు దక్కించుకోవాలనే విషయంపై హృతిక్, ఎన్టీఆర్ మధ్య ఒకవేళ వార్ జరిగితే.. 2 కచ్చితంగా బ్యా*బ్లస్టర్ అవుతుంది" అని రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు. బికినీతో ఉన్న కియారా ఫొటోలను షేర్ చేశారు.

ఆర్జీవీ ట్వీట్‍పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇవేం మాటలు, బుద్ధుందా అని ఓ యూజర్ కా...