Hyderabad, ఆగస్టు 17 -- వార్ 2 బాక్సాఫీస్ కలెక్షన్ డే 3: హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన స్పై యాక్షన్ చిత్రం వార్ 2 ఆకట్టుకునే కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఆగస్ట్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2 ఆగస్ట్ 14న విడుదలైన మొదటి మూడు రోజులు మంచి ప్రదర్శన ఇచ్చింది.

మొదటి రోజు తనతోపాటు థియేటర్లలో విడుదలైన కూలీ మూవీ కంటే తక్కువ కలెక్షన్స్ రాబట్టిన వార్ 2 రెండో రోజు మాత్రం ఎక్కువ వసూళ్లు సాధించింది. ట్రేడ్ ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం వార్ 2 ఆగస్టు 16 శనివారం అంటే మూడో రోజున భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద రూ. 33.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది.

అయితే, ఇది శుక్రవారం అయిన రెండో రోజుతో పోలిస్తే 42 శాతం క్షీణించింది. అంటే, 42 శాతం మేర వార్ 2 కలెక్షన్స్ మూడో రోజు పడిపోయాయి. ఇక మూడు రోజుల్లో ఇండియాలో వార్ 2 సినిమా రూ. 142.35...