భారతదేశం, డిసెంబర్ 17 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో విన్నర్ ఎవరో ఓ క్లారిటీ వచ్చేసినట్లే ఉంది. ఇప్పుడు ఓటింగ్ ట్రెండ్ చూస్తే ఇది ఖాయమనిపిస్తోంది. ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ ఈ సారి బిగ్ బాస్ ట్రోఫీ గెలుస్తాడనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. జనాలు అతనికి తమ ఓట్లతో మద్దతు తెలియజేస్తున్నారు. కల్యాణ్ గెలవాలని బలంగా కోరుకుంటున్నారు.

బిగ్ బాస్ 9 తెలుగు ఎండింగ్ కు చేరుకుంది. గ్రాండ్ ఫినాలేకు ముందు మరో మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే హౌస్ లో టాప్-5 కంటెస్టెంట్లు ఉన్నారు. పడాల కల్యాణ్, తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సంజన గల్రానీ ఫైనల్ కు అర్హత సాధించారు. వీళ్లలో నుంచి ఒకరు విజేతగా నిలుస్తారు. ఆ ఒకరు ఎవరు అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

బిగ్ బాస్ తెలుగులో ఈ సీజన్ ను మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్లలో చాలా మంది మాట.. విన్నర్ కల్యా...