భారతదేశం, అక్టోబర్ 5 -- చిరంజీవి, జాకీ ష్రాఫ్, శోభన, రేవతి, రమ్యకృష్ణన్, వెంకటేష్ దగ్గుబాటి వంటి 80ల నాటి సూపర్ స్టార్లు మరోసారి కలిశారు. ప్రతి ఏడాది మీట్ అయ్యే ఈ సెలబ్రిటీలు ఇప్పుడు మూడు సంవత్సరాల విరామం తర్వాత చెన్నైలోని నటుడు, దర్శకుడు రాజ్‌కుమార్ సేతుపతి, శ్రీప్రియ నివాసంలో కలిశారు.

1980ల నాటి మిత్రులతో చిరంజీవి సందడి చేశారు. గ్రూప్ ఫొటోలను ఎక్స్ లో షేర్ చేశారు మెగాస్టార్.

''80ల నాటి నా ప్రియమైన స్నేహితులతో ప్రతి రీయూనియన్ ఒక జ్ఞాపకాల ప్రయాణం. దశాబ్దాలుగా మేము పంచుకున్న విడదీయరాని బంధం అలాగే ఉంది. ఎన్నో అందమైన జ్ఞాపకాలు. ప్రతి కలయిక మొదటిసారి కలిసినంత తాజాగా అనిపిస్తుంది" అని చిత్రాలతో పాటు ఒక స్వీట్ నోట్ రాశారు చిరు.

సీనియర్ నటి రేవతి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కూడా ఈ ఫోటోలను పంచుకుంది. "క్లాస్ ఆఫ్ 80 స్టిల్ రాక్స్. మేము సాధార...