భారతదేశం, సెప్టెంబర్ 2 -- పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ (సెప్టెంబర్ 2) తన 53వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఆయన సోదరుడు, మెగా స్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కు స్పెషల్ విషెస్ చెప్పారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేసిన ఓ ఫొటో తెగ వైలర్ గా మారింది.

పవన్ కల్యాణ్ తో ఉన్న ఒక పాత ఫోటోను పంచుకుంటూ సోషల్ మీడియాలో చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి మంగళవారం ఎక్స్ లో షేర్ చేసిన ఆ ఫోటోలో పవన్ కల్యాణ్ చిరంజీవిని వెనుక నుండి హత్తుకున్నారు. ఇద్దరూ బ్లూ కలర్ షేడ్స్ లో హుడీలు ధరించి ఉన్నారు.

''చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీ...