భారతదేశం, జూన్ 15 -- ఇండియా, ఇండియా-ఎ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ చెలరేగిపోయాడు. అజేయంగా 122 పరుగులు సాధించాడు. ఈ బ్యాటింగ్ విధ్వంసంతో ఆల్ రౌండర్ శార్దూల్.. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం టీమిండియాలో చోటు దక్కించుకునే అవకాశాలను మెరుగుపర్చుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్ తో కూడిన బౌలింగ్ ఎటాక్ ను ఎదుర్కొన్నాడు శార్దూల్.

అంతకుముందు కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, కరుణ్ నాయర్ వంటి వారిని ఇబ్బంది పెట్టిన శార్దూల్ ఇండియా-ఎ జట్టుకు బౌలింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. అంతకుముందు సర్ఫరాజ్ ఖాన్ 76 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. రెండో రోజు ఆటలో శార్దూల్ క్రీజులో అజేయంగా నిలిచాడు. మూడో రోజు బ్యాటింగ్ కు వచ్చి సెంచరీ సాధించాడు. నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ లలో ఎవ...