Hyderabad, జూన్ 26 -- రష్మిక మందన్నా గత మూడు, నాలుగేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర అన్నీ బ్లాక్‌బస్టర్ హిట్స్ అందిస్తూ దూసుకెళ్తోంది. తెలుగులోనే కాదు ఇండియాలోనే ఏ హీరోయిన్ కు సాధ్యం కాని రికార్డు ఇది. ఆమె కథల ఎంపిక అలా ఉంటోంది మరి. తాజాగా తన కొత్త మూవీ అనౌన్స్ అయింది. ఇందులోనూ రష్మిక లుక్ ఆకట్టుకుంటోంది.

నేషనల్ క్రష్ గా పేరుగాంచిన రష్మిక మందన్నా ఇప్పుడు అసలుసిసలు పాన్ ఇండియా స్టార్ గా నిలుస్తోంది. తాజాగా కుబేర సక్సెస్ తో రష్మిక మరో మెట్టు పైకి ఎక్కింది. ఈ నేపథ్యంలో ఆమె నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను శుక్రవారం (జూన్ 27) ఉదయం 10:08 గంటలకు రిలీజ్ చేయనున్నారు. గురువారం (జూన్ 26) ప్రీలుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇందులో రష్మిక చాలా పవర్‌ఫుల్ గా ఓ వారియర్ గా కనిపిస్తోంది. ఈ పోస్టర్ ఓ అడవి బ్యాక్‌డ్రాప్ లో ఉంది. ఇందుల...