భారతదేశం, డిసెంబర్ 6 -- ప్రస్తుతం ఇండిగో ఎయిర్ లైన్స్ హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా సాంకేతిక లోపం కారణంగా ఇండిగో విమానాల జాప్యం, క్యాన్సిలేషన్ వంటివి తలెత్తుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇండిగో ఎయిర్ లైన్స్‌పై, వారి సిబ్బందిపై విరుచుకుపడుతున్నారు.

వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. ఈ పరిస్థితి టెర్మినల్స్‌లో తీవ్ర వాగ్వాదాలు, అరుపులకు దారితీసింది. దీనికి సంబంధించిన అనేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, విమాన షెడ్యూల్‌పై స్పష్టత ఇవ్వాలని కోరుతూ కోపోద్రిక్తులైన ప్రయాణికులు ఇండిగో సిబ్బందిని నిలదీస్తున్న దృశ్యాలు ఈ వీడియోలలో కనిపిస్తున్నాయి.

అయితే, ఈ వ్యవహారంపై రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్ రియాక్ట్ అయ్యారు. శనివారం (డిసెంబర్ 06) ఉదయం తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాల...