భారతదేశం, జూలై 2 -- టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు త్వరలో 90 ఏళ్లు నిండనున్నాయి. ఆయన వయస్సు కారణంగా వారసుడి గురించి చర్చ మళ్లీ తీవ్రమైంది. ప్రస్తుతం 15వ దలైలామాను తన వారసుడిగా ఎన్నుకునే 14వ దలైలామా ఉన్నారు. దలైలామాను ఎన్నుకునే ఈ సంప్రదాయం సుమారు 600 సంవత్సరాలుగా కొనసాగుతోంది. తన వారసుడి గురించి ఒక ప్రకటన ఇచ్చారు దలైలామా. ఒక నివేదిక ప్రకారం.. టిబెటన్ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం వారసుడిని ఎంపిక చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇందులో చైనాకు ఎటువంటి పాత్ర ఉండదన్నారు. తమకు అనుకూలమైన వ్యక్తిని దలైలామాగా నియమించాలని చైనా భావిస్తోంది.

ఈ బౌద్ధ సంప్రదాయం ప్రకారం కాకుండా చైనా తదుపరి దలైలామాను ఎన్నుకునేందుకు కుతంత్రాలు చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తన మరణం తర్వాత వారసుడిని ఎన్నుకునే అధికారం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కు దలైలామా అప్పగించారు. భవిష్య...