భారతదేశం, డిసెంబర్ 17 -- రాజమౌళి, మహేష్ బాబు మూవీ వారణాసిలో మందాకినిగా అలరించబోతున్న ప్రియాంకా చోప్రా ఇప్పుడో కామెడీ షోలో గెస్టుగా వస్తోంది. 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సీజన్ 4 నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 20న ప్రారంభం కానుంది. మొదటి ఎపిసోడ్‌లో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా అతిథిగా రానుంది. ఇందులో 'వారణాసి' (Varanasi) విశేషాలతో పాటు కపిల్ శర్మ, సునీల్ గ్రోవర్‌లతో ఆమె చేసిన కామెడీ హంగామా ప్రోమోలో ఆకట్టుకుంటోంది.

ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న పాపులర్ కామెడీ షో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సీజన్ 4 గ్రాండ్‌గా మొదలుకాబోతోంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా 'దేశీ గర్ల్' ప్రియాంక చోప్రా వస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 20న రాత్రి 8 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవు...