భారతదేశం, డిసెంబర్ 17 -- ప్రపంచంలోని ఇద్దరు అద్భుతమైన ఫిల్మ్ మేకర్స్ ఒకరినొకరు ఇంటర్వ్యూ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ను ఓ వీడియో కాల్ లో ఎస్ఎస్ రాజమౌళి ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఈ వీడియోను 20th Century Studios India తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.

జేమ్స్ కామెరాన్ తీసిన అవతార్ 3 రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. ఆ మూవీ టీమ్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే రాజమౌళి రంగంలోకి దిగాడు. కామెరాన్ తో వీడియో కాల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇండియాలో అవతార్: ఫైర్ అండ్ యాష్ చూసే అవకాశం దక్కిన తొలి వ్యక్తుల్లో తాను ఒకడినని, ఆ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని కామెరాన్ తో రాజమౌళి చెప్పాడు.

ఇక కామెరాన్ మాట్లాడుతూ.. రాజమౌళి తీస్తున్న వారణాసి మూవీ గురించి ఆరా తీశాడు. ఈ సినిమా షూటింగ్ ఏడాదిగా జరుగు...