భారతదేశం, నవంబర్ 21 -- ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మక మూవీ 'వారణాసి'పై అంచనాలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో.. రాజమౌళి ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశాడు. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సౌండ్‌ట్రాక్ గురించి కీరవాణి మాట్లాడుతూ.. అభిమానులు ఈ సినిమాలో గొప్ప మ్యూజిక్ ఆశించవచ్చని అన్నాడు.

ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)కు హాజరైన కీరవాణి.. పీటీఐతో మాట్లాడాడు. "అభిమానులు అద్భుతమైన గొప్పదనాన్ని ఆశించవచ్చు. అంతకు మించి నేను ఏమీ చెప్పకూడదు. వారణాసి సినిమాలో ఆరు పాటలు ఉంటాయి" అని కీరవాణి తెలిపాడు.

కీరవాణి ఈ సినిమా సంగీతం గురించి మాట్లాడుతూ.. తనపై ఎల...