భారతదేశం, ఏప్రిల్ 27 -- త్తరప్రదేశ్‌లోని వారణాసిలో బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు తీసుకెళ్తున్నానని చెప్పి ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించాడు కెనడా జాతీయుడు. అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. తదుపరి విచారణ కోసం కెనడియన్‌ను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరుకు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందని ఒక విదేశీయుడు ప్రయాణికులతో చెప్పడంతో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి విమానాశ్రయంలో భయాందోళనలు నెలకొన్నాయి. భద్రతా అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. తరువాత ఆదివారం ఉదయం విమానాన్ని బెంగళూరుకు పంపారు. అదే సమయంలో పోలీసులు కెనడియన్ పౌరుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

శనివారం రాత్రి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింద...