భారతదేశం, నవంబర్ 17 -- వారణాసి టైటిల్ టీజర్ దుమ్మురేపుతోంది. మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై హైప్ మరో రేంజ్ కు వెళ్లిపోయింది. శనివారం (నవంబర్ 15) హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్ లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రం టైటిల్ ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

గ్లోబ్ ట్రాటర్ పేరుతో నిర్వహించిన ఈవెంట్లో వారణాసి టైటిల్, మహేష్ బాబు ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ కార్యక్రమానికి రాజమౌళితో పాటు చిత్రంలోని ప్రధాన తారలు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాజరయ్యారు. అయితే చిత్రంలోని నటీనటుల పేర్లు టైటిల్ పోస్టర్‌లో లేవని, సాంకేతిక నిపుణుల పేర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని తాజాగా ఆడియన్స్ గుర్తించారు. రాజమౌళి ఇలా ఎందుకు చేశారోననే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

శనివారం రాత్రి చిత్ర ...