భారతదేశం, నవంబర్ 17 -- సూప‌ర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా ద‌ర్శ‌క‌ ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం 'వారణాసి'. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తోన్న‌ చిత్రానికి 'వారణాసి' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

వారణాసి సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ మేరకు గ్లోబ్ ట్రాటర్ అంటూ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర యూనిట్ ఈ కార్యక్రమంలోనే టైటిల్‌ను, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, సినిమా స్థాయిని చాటేలా ఓ టీజర్‌ (వారణాసి టు ది వరల్డ్)ను కూడా రిలీజ్ చేశారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బజ్ క్రియేట్ చేసిన ఈ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటుగా చిత్రయూనిట్ పాల్గొంది. ఇక ఈ ఈవెంట్‌లో స్టార్ రైటర్, రాజమౌళి...