భారతదేశం, ఫిబ్రవరి 22 -- దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' (Varanasi) సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది.

తాజాగా, వారణాసి సినిమాలో మహేశ్ బాబు 'శ్రీ రాముడి' లుక్ లీక్ అయిందంటూ ఒక పోస్టర్ నెట్టింట హల్‌చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. శనివారం (ఫిబ్రవరి 21) 'ఆల్వేస్ బాలీవుడ్' అనే ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ ఒక పోస్టర్‌ను షేర్ చేస్తూ.. గుంటూరులోని మైత్రి సినిమాస్ వద్ద 'వారణాసి' హోర్డింగ్‌పై మహేశ్ బాబు లుక్ దర్శనమిచ్చిందని పేర్కొంది.

ఆ పోస్టర్‌లో మహేశ్ బాబు కాషాయ వస్త్రాలు ధరించి, చేతిలో విల్లు, వెనుక అమ్ముల పొదతో ఒక ...