భారతదేశం, డిసెంబర్ 23 -- టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత మాత్రం మారదు. ప్రస్తుతం మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ ట్రావెల్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి' (Varanasi) షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే, నిరంతర షూటింగ్ షెడ్యూల్స్ మధ్య దొరికిన చిన్న విరామాన్ని మహేశ్ బాబు తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. వారణాసికి బ్రేక్ ఇచ్చి తన ముగ్గురు సోదరీమణులు, భార్య నమ్రత, మేనల్లుళ్లు, మేనకోడళ్లతో కలిసి మహేశ్ బాబు సరదాగా గడిపిన అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.

మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని, బావ స్వరూప్ సంజయ్ ఈ ఫ్యామిలీ గెట్-టుగెదర్ ఫోటోలను షేర్ చేశారు. వైట్ షర్ట్, జీన్స్, నెత్తిన బెయిజ్ కలర్ క్యాప్‌తో మహేష్ ఎంతో స్టైలిష్‌గా, రిలాక్స్‌డ...