Hyderabad, జూలై 25 -- బాలీవుడ్‌లో ఓ చిన్న సినిమాగా రిలీజై బాక్సాఫీస్ దగ్గర సంచలనాల పరంపరను కొనసాగిస్తోంది సయ్యారా మూవీ. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 'సయ్యారా' సినిమా ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ.250 కోట్ల మార్క్‌ను దాటి, ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రొమాంటిక్ జానర్‌లోకి మోహిత్ సూరి తిరిగి రావడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ భారీ బజ్‌తోపాటు అనూహ్య స్పందనలు వెల్లువెత్తాయి.

యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సయ్యారా మూవీ తాజా ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ వసూళ్ల వివరాలను వారి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. 'సయ్యారా' రూ.256 కోట్లు వసూలు చేసినట్లు ఆ పోస్ట్‌లో పేర్కొంది. ఇండియాలో దీని గ్రాస్ వసూళ్లు ఇప్పుడు రూ.212.5 కోట్లకు చేరుకున్నాయి. విదేశాల్లో కూడా 'సయ్యారా' 5 మిలియన్ డ...