భారతదేశం, జూన్ 24 -- హిందీ వెబ్ సిరీస్ ల్లో పంచాయత్ సిరీస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓ విలేజ్ లో పొలిటికల్ డ్రామాగా వచ్చే ఈ సిరీస్ లో కామెడీకి కొదవ ఉండదు. తొలి మూడు సీజన్లు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేసింది. మంగళవారం (జూన్ 24) నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

పంచాయత్ సీజన్ 4 వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే వారం రోజుల ముందే ఈ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ రోజు నుంచే ఆడియన్స్ కు అందుబాటులో ఉంది. ఈ హిందీ వెబ్ సిరీస్ ఈ సారి మరింత ప్రత్యేకంగా రెడీ అయింది. ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూసిన ఆ టైమ్ రానే వచ్చింది.

ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ పంచాయత్ సీజన్ 4 ట్రైలర్‌ను ఒక వారం క్రితం విడుదల చేసి, ఓటీటీ విడుదల తేదీ ముందుకు తెచ...