భారతదేశం, జనవరి 14 -- తెలంగాణలోని హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో వారం రోజుల్లో 500 కుక్కలను చంపేశారు. అయితే బయటకు రాని ఘటనలు ఇంకా ఉన్నాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. గ్రామాల్లో వీధి కుక్కల బెడద లేకుండా చేస్తామని, ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చిన హామీ ప్రకారమే.. ఈ ఘటనలు జరుగుతున్నాయి.

మరోవైపు వీధి కుక్కలను సామూహికంగా చంపడంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హన్మకొండ, కామారెడ్డి జిల్లాలలో ఏడుగురు సర్పంచ్‌లు సహా అనేక మందిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. కొత్త సంవత్సరం మొదటి రెండు వారాల్లో కనీసం 500 కుక్కలను విషప్రయోగం చేసి చంపారనే నివేదికల తర్వాత జంతు హింసపై చర్చ నడుస్తోంది.

ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో అనేక మంది సర్పంచ్ అభ్యర్థులు జనాలకు కుక్కలు లేని గ్రామంగా చేస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత కుక్కలను చంపడం మెుదల...