Hyderabad, జూన్ 17 -- ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో బ్లాక్‌బస్టర్ ఆలప్పుళ జింఖానా (Alappuzha Gymkhana). ఈ సినిమా గత గురువారం (జూన్ 12) నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లో చూడొచ్చు. అయితే ఇప్పుడు తెలుగు వెర్షన్ మరో ఓటీటీలోకి కూడా వస్తుండటం విశేషం.

ప్రేమలు మూవీ ఫేమ్ నస్లేన్ నటించిన మూవీ ఆలప్పుళ జింఖానా. విషు సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. రెండు నెలల తర్వాత ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చింది.

ఇక ఇప్పుడు తెలుగు వెర్షన్ వచ్చే శుక్రవారం (జూన్ 20) నుంచి ఆహా వీడియో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది. దీంతో రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఈ మూవీ తెలుగు వెర్షన్ ను చూసే అవకాశం ఇక్కడి ప్రేక్షకులకు దక్కనుంది. ఈ సినిమా ఆహాలోకి కూడా వస్తే.. మరింత మంది ప్రేక్షకుల దగ్గరకు చేరనుంది. ...