భారతదేశం, జూన్ 14 -- మూవీపై అంచనాలను మరింత పెంచేస్తూ.. విజువల్ గ్రాండ్ ఫీస్ట్ గా కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది. శనివారం (జూన్ 14) కొచ్చిలో జరిగిన ఈవెంట్ లో మోహన్ లాల్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా, తన డ్రీమ్ ప్రాజెక్టుగా మంచు విష్ణు ఈ సినిమాను నిర్మించారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీని మంచు విష్ణు తిన్నడి క్యారెక్టర్ చేశాడు.

కన్నప్ప సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజైంది. ఇందులో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓ గూడెంలో ఉండే తిన్నడు (మంచు విష్ణు) చిన్నప్పటి నుంచి దేవుడంటే నమ్మడు. చిన్నతనంలో దేవుడి విగ్రహంపై తిన్నడు రాయి విసిరే సీన్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. దేవుడు లేడు, అది వట్టి రాయి అంటూ చిన్నప్పటి తిన్నడు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది.

వా...