Andhrapradesh,telangana, సెప్టెంబర్ 26 -- బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడనుంది. రేపటి ఉదయానికి ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ వివరాల ప్రకారం.. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్,మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారె...