Telangana,andhrapradesh, మే 29 -- ఉత్తర బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం. వాయుగుండంగా మారింది. ఇవాళ తీరం దాటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలను జారీ చేసింది.

ఏపీలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 31 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం,వైఎస్ఆర్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది...