భారతదేశం, డిసెంబర్ 23 -- ప్రస్తుతం షూటింగ్ చేసుకుంటున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో వారణాసి ఒకటి. రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా చేస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీని కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. బడ్జెట్ రూ.1300 కోట్లు అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై హీరోయిన్ ప్రియాంక చోప్రా చేసిన కామెంట్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

పాపులర్ కామెడీ షో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సీజన్ 4 ఓపెనింగ్ ఎపిసోడ్ లో ప్రియాంక చోప్రా గెస్ట్ గా వెళ్లింది. ఇందులో ఆమె రాబోయే చిత్రం 'వారణాసి' గురించి జరిగిన సరదా సంభాషణ ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది సుమారు రూ.1,300 కోట్ల సినిమా అనే పుకార్లు వినిపిస్తున్నాయని కపిల్ అడుగుతాడు. నవ్వుతూ ప్రియాంక 'హా (అవును)' అని చెబుతూ సంభాషణను కొనసా...