భారతదేశం, ఏప్రిల్ 26 -- ఎస్ఎస్ఎంబీ 29.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ఇదే. ఇప్పుడు సినీ ఫీల్డ్ లో ఈ మూవీ గురించే బజ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ మూవీ కోసం రాజమౌళి తీసుకుంటున్న రెమ్యూనేషన్ కూడా హాట్ టాపిక్ గా మారింది. గ్లోబల్ సెన్సేషన్ గా మారిన రాజమౌళి ఈ మూవీ కోసం హీరో మహేష్ బాబు కంటే ఎక్కువ పేమెంట్ తీసుకుంటున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

బాహుబలితో ప్రపంచ బాక్సాఫీస్ ను షేక్ చేసి.. తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్ కు పెంచారు రాజమౌళి. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తోనూ అదరగొట్టారు. ఈ సూపర్ హిట్ సినిమాలతో రాజమౌళి రెమ్యూనేషన్ అమాంతం పెరిగిపోయిందని టాక్. ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 మూవీకి ఆయన రూ.200 కోట్లు పేమెంట్ గా అందుకుంటున్నారని టాక్. ఈ రెమ్యూనేషన్ తో ఇండియాలోనే అత్యధిక మొత్తం అం...