భారతదేశం, మే 15 -- ఒక్కో సినిమాతో రేంజ్ పెంచుకుంటూ.. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఎదుగుతున్నారు హీరో నాని. ఈ నేచురల్ స్టార్ వరుసగా రూ.100 కోట్ల కలెక్షన్ల మూవీస్ అందిస్తున్నారు. మినిమమ్ హిట్ గ్యారెంటీ హీరో నుంచి వంద కోట్ల హీరోగా ఎదిగారు నాని. రీసెంట్ గా హిట్ 3 మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. దీంతో నాని అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఆయన సినిమాల కోసం భారీ పోటీ ఎదుర్కొంది. క్రేజ్ కు తగ్గట్లుగా బిజినెస్ జరుగుతోంది.

హిట్ 3 తర్వాత 'ది ప్యారడైజ్' సినిమాను రెడీ చేస్తున్నారు నేచురల్ స్టార్ నాని. శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. హిట్ 3 బంపర్ హిట్ తో ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆడియో రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది. ది ప్యారడైజ్ మూవీ ఆడ...