భారతదేశం, ఆగస్టు 27 -- ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ సెగ్మెంట్లో కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా చైనా కంపెనీ బీవైడీ ఈ విభాగంలో పలు రికార్డులు నెలకొల్పుతోంది. ఇప్పుడు అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు టెక్నాలజీని తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. బీవైడీ YANGWANG యూ9 ట్రాక్ వెర్షన్ గరిష్ట వేగం గంటకు 472.41 కిలోమీటర్లు సాధించినట్లు కంపెనీ నివేదించింది.

జర్మనీలోని ఆటోమోటివ్ టెస్టింగ్ పాపెన్ బర్గ్(ఏటీపీ) ప్లాంట్‌లో ఈ ట్రాక్ రన్ జరిగింది. ఇదే ట్రాక్‌లో గతంలో జూలైలో రెమ్యాక్ నవేరా ఆర్ హైపర్ కార్ పలు రికార్డులు సృష్టించింది. దీని గరిష్ట వేగం గంటకు 0 నుండి 60 కిలోమీటర్లు, 0 నుండి 100 కిలోమీటర్లు, గంటకు 0 నుండి 400 కిలోమీటర్లు. తాజాగా బీవైడీ YANGWANG యూ9 ట్రాక్-ఫోకస్డ్ వెర్షన్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారుగా అవతరి...