భారతదేశం, ఫిబ్రవరి 11 -- అజిత్ కుమార్.. తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో. తెలుగులోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అజిత్ సినిమాల కోసం అభిమానులు వెయిట్ చేస్తుంటారు. తన స్టార్ డమ్ కారణంగా అజిత్ కూడా రెమ్యునరేషన్ భారీగా పెంచేశారని తెలిసింది. ఇప్పుడు అనిల్ సుంకర నిర్మాతగా రాబోతున్న సినిమా కోసం అజిత్ ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని టాక్.

టాలీవుడ్ ప్రొడ్యూసర్లలో అనిల్ సుంకర ఒకరు. రీసెంట్ గా నారీ నారీ నడుమ మురారి మూవీతో ఆయన హిట్ అందుకున్నారు. తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా, అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో అనిల్ సుంకర మూవీ ప్రొడ్యూస్ చేయబోతున్నారనే వార్త రీసెంట్ గా హాట్ టాపిక్ గా మారింది. ఏకే64 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చాయి.

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ మూవీ అనౌన్స్ మెంట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస...