భారతదేశం, ఏప్రిల్ 18 -- సీరియ‌ల్స్‌లో ఓ యాక్ట‌ర్ స్థానంలో మ‌రో యాక్ట‌ర్ ఎంట్రీ ఇవ్వ‌డం కామ‌న్‌. డేట్స్ అడ్జెస్ట్ కాక‌పోవ‌డ‌మో, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఓ న‌టి లేదా న‌టుడో సీరియ‌ల్ నుంచి త‌ప్పుకుంటే...అదే పాత్ర‌లోకి మ‌రో యాక్ట‌ర్ ఎంట్రీ ఇచ్చి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తుంటారు. కానీ లీడ్ యాక్ట‌ర్స్ మార‌డం మాత్రం అరుదు.

స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న గీత ఎల్ఎల్‌బీ సీరియ‌ల్‌లో మాత్రం ఏకంగా హీరోనే మారిపోయాడు.గ‌త డిసెంబ‌ర్‌లో స్టార్ మా ఛానెల్‌లో గీత ఎల్ఎల్‌బీ సీరియ‌ల్ మొద‌లైంది. కోర్ట్ రూమ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సీరియ‌ల్‌లో క‌న్న‌డ న‌టుడు భ‌వీష్ లీడ్ రోల్‌లొ న‌టించాడు.

తాజాగా శుక్ర‌వారం నాటి ఎపిసోడ్‌లో భ‌వీష్ స్థానంలో క‌న్న‌డ న‌టుడు గౌర‌వ్ గుప్తా ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. హీరో మార్పుకు కార‌ణం ఏమిట‌న్న‌ది మాత్రం స్టార్ మా రివీల్ చేయ‌...