భారతదేశం, డిసెంబర్ 29 -- రికార్డులు నెలకొల్పడం, వాటిని తిరగరాయడం.. ఇదే పనిగా సాగుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటివరకూ ఇండియన్ సినిమాలో అత్యధిక ఓటీటీ రేట్ పలికిన సినిమాగా పుష్ఫ 2 ఉంది. ఆ సినిమా ఓటీటీ రేట్లకు ఏకంగా రూ.275 కోట్లు వచ్చాయి. ఇప్పుడా రికార్డును అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న మూవీ బ్రేక్ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఏఏ22 x ఏ6 వర్కింట్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఓ క్రేజీ బజ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ డీల్ ఏకంగా రూ.600 కోట్లకు కుదిరినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం రికార్డు రేటు చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్ ఓకే చెప్పిందని తెలుస్తోంది. అన్ని భాషల్లో కలిపి ఇంత మొత్తం చెల్లించనుందని ట...