భారతదేశం, అక్టోబర్ 1 -- ఏపీలోని పల్నాడు జిల్లాలో గూస్‌బంప్స్ తెప్పించేలా భయంకరంగా ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. బోలెరో వాహనం స్కూటర్‌ను ఢీకొట్టి సుమారు 3 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాలను స్థానికులు రికార్డ్ చేశారు. వీడియో సో,ల్ మీడియాలో బాగా వైరల్ అయింది. స్కూటర్‌ను ఢీకొట్టిన తర్వాత కూడా డ్రైవర్ ఆపకుండా వెళ్తూనే ఉన్నాడు. స్థానికులు వెంటపడి వాహనాన్ని ఆపారు.

ఈ ఘటన పిడుగురాళ్ల సమీపంలోని బ్రాహ్మణపల్లి దగ్గర బైపాస్‌ రోడ్డు మీద జరిగింది. బోలెరో వాహనం స్కూటర్‌ను ఢీకొట్టి.. మూడు కిలో మీటర్లు లాక్కెళ్లే వీడియోలో నిప్పులు వచ్చాయి. బోలెరో నడిపే వ్యక్తి మద్యం తాగినట్టుగా గుర్తించారు. వాహనం చాలా స్పీడ్‌గా వస్తూ.. స్కూటర్‌ను ఢీ కొట్టింది. దీంతో స్కూటర్‌ కాస్త బోలెరో టైర్‌కు ఇరుక్కుపోయింది. ...