భారతదేశం, మే 13 -- ఎండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలతో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మంగళవారం మధ్యాహ్నం నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకినట్లు పేర్కొంది. అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి నైరుతి రుతుపవనాలు చేరినట్లు ఐఎండీ వెల్లడించింది.

అండమాన్ పరిసరాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల రాకతో గత రెండు రోజులుగా నికోబార్‌ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రానున్న మూడు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్‌ నికోబార్‌ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం వరకు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందని ఐఎండీ వెల్లడించింది. మే 27 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

Published by HT Digital Content Services wit...