భారతదేశం, ఆగస్టు 31 -- గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కల్యాణ్ కు, జనసేన పార్టీకి సపోర్ట్ చేసింది. కానీ అందుకు విరుద్ధంగా అల్లు అర్జున్ మాత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్రారెడ్డికి సపోర్ట్ గా ఇంటికి వెళ్లడం కలకలం రేపింది. దీంతో అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ విరచుకుపడ్డారు. అలాంటిది ఇప్పుడు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ హత్తుకోవడం, ఒక్క దగ్గర కనిపించడం వైరల్ గా మారింది.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఆయన కుటుంబం ప్రస్తుతం తమ తల్లి అల్లు కనకరత్నం మరణం బాధలో ఉన్నారు. అల్లు అర్జున్ కు ఆమె నానమ్మ. చిరంజీవి భార్య సురేఖకు అమ్మ. ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 31) అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు పవన్ కల్యాణ్. శనివారం తెల్లవారుజామును అల్లు కనకరత్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కానీ విశాఖపట్నంలో అఫీషియల్ ప్రోగ్రామ్...