భారతదేశం, ఆగస్టు 20 -- టీమిండియా మాజీ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పై అతని మాజీ భార్య ధనశ్రీ వర్మ ఫైర్ అయింది. విడాకుల సమయంలో కోర్టులో ఏడ్చేశానని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ. ముఖ్యంగా విడాకుల రోజు కోర్టుకు చాహల్ వేసుకొచ్చిన టీ షర్ట్ పై మండిపడింది.

యూట్యూబ్‌లో హ్యూమన్స్ ఆఫ్ బాంబే కోసం ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో విడాకుల గురించి మాట్లాడింది. చివరి విచారణ సమయంలో కోర్టులో తాను భావోద్వేగానికి గురయ్యానని ధనశ్రీ వెల్లడించింది.

"తీర్పు ఇవ్వబోతున్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది. మానసికంగా బాగా సిద్ధమైనప్పటికీ నేను చాలా భావోద్వేగానికి లోనయ్యా. అందరి ముందు ఏడ్వడం మొదలుపెట్టా. ఆ సమయంలో నా ఫీలింగ్ ఏంటో కూడా చెప్పలేకపోయా. నేను ఏడుస్తూనే ఉన్నా. అయితే అదంతా జరిగిపోయింది. అతను (చాహల్) ముందు బయటకు వెళ్ళాడు" అని...