భారతదేశం, మే 9 -- వాట్సాప్ కోసం రెండు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లను తీసుకురావడానికి మెటా సన్నాహాలు చేస్తోంది. ఇవి వినియోగదారులకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని మెటా చెబుతోంది.

ఫీచర్ ట్రాకర్ డబ్ల్యూఏబీటాఇన్ఫో ప్రకారం, మొదటి కొత్త సాధనం మెసేజ్ సమ్మరీ ఫీచర్. ఇది వినియోగదారులకు సందేశాలను సమ్మరైజ్ చేసి ఇస్తుంది. తద్వారా యూజర్ కు చాలా టైమ్ సేవ్ అవుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ కోసం అభివృద్ధి చేస్తున్నారు. మెసేజ్ ల సైజ్ పెద్దగా ఉన్నప్పుడు యూజర్ ఈ సమ్మరీ విత్ మెటా ఏఐ' బటన్ ను ఉపయోగించవచ్చు. దీనిద్వారా వినియోగదారులు కీలక సమాచారాన్ని త్వరగా పొందడానికి వీలు కలుగుతుంది. ముఖ్యంగా, ఈ ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను సంరక్షిస్తుందని, ఏఐని ఉపయోగించి సందేశాలను సంక్షిప్తీకరించినప్పటికీ, యూజర్ ప్రైవసీ మరియు భద్రత చెక్కుచెదర...