భారతదేశం, డిసెంబర్ 22 -- ఏపీ ప్రభుత్వం ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ సేవలు ఒక్క క్లిక్‌తో మీ ఫోన్‌లో పొందవచ్చు. ఆఫీసుల చుట్టూ పదే పదే తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే అనేక సేవలను ఆన్‌లైన్‌లో తీసుకొచ్చింది. వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో మీరు చాలా సర్వీసులు పొందవచ్చు. పలు రకాల సర్టిఫికేట్లు పొందేందుకు ఆన్‌లైన్ సేవలు ఉన్న విషయం తెలిసిందే. మనమిత్ర వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా అనేక సేవలను జనాలు పొందుతున్నారు.

సంక్రాంతి వరకు మరిన్ని సేవలు ఆన్‌లైన్‌లో అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక ఇంటి నుంచే ఎలాంటి సర్వీస్ అయినా పొందేలా ప్లాన్ చేస్తోంది. అంతా డిజిటల్ చేయాలని యోచిస్తోంది. దీనిద్వారా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తగ్గుతుంది. తాజాగా మరో సేవను కూడా వాట్సాప్ గవర్నెన్స్‌ ద్వారా అందిస్తున్నారు.

పోలీస్ స...