భారతదేశం, జూన్ 3 -- ఎలాన్ మస్క్ కు చెందిన ఎక్స్ యాప్ లో కొత్తగా చాట్ ఇంటర్ ఫేస్ ను ప్రవేశపెట్టారు. దీనిని ఇప్పుడు ఎక్స్ చాట్ అని పిలుస్తారు. ఎక్స్ చాట్ అనేది ఇన్-యాప్ డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్. ఇది వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ డిఎం, తదితర ప్లాట్ ఫామ్స్ మాదిరిగానే వినియోగదారులు తమ స్నేహితులతో నిరాటంకంగా కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

బిట్ కాయిన్ తరహా ఎన్ క్రిప్షన్, డిసప్పియరింగ్ మెసేజెస్, క్రాస్ ప్లాట్ ఫామ్ ఆడియో/వీడియో కాల్స్ వంటి అధునాతన ఫీచర్లతో ఎక్స్ చాట్ ను లాంచ్ చేస్తున్నట్లు మస్క్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ చాట్ ను షేర్ చేశారు. ఈ కొత్త డిఎం ఫీచర్ అనేక ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ లతో పోటీపడగలదు. ఈ ప్లాట్ ఫామ్ లో వాటిలో లేని అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉన్నాయని మస్క్ వెల్లడించారు.

ఎక్స్ చాట్ అనేది అదనపు ఫీచర్లు ఉన్...