భారతదేశం, జనవరి 21 -- ఇండియన్ స్టార్ క్రికెటర్, ఆధునిక లెజెండ్ విరాట్ కోహ్లి అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. వన్డేల్లో సెన్సేషనల్ బ్యాటింగ్ తో రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉన్నాడు. అదిరే ఆటతీరుతో విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడు. రీసెంట్ గా ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో మళ్లీ నంబర్ వన్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీని దేశవాళీ క్రికెట్ ఆడాలని ఫోర్స్ చేయొద్దని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించాడు.

భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన చివరి 7 వన్డేలలో 6 ఫిఫ్టీ-ప్లస్ స్కోర్లు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలున్నాయి. రెండు దక్షిణాఫ్రికాపై, ఒకటి న్యూజిలాండ్‌పై అందుకున్నాడు. క్రీజ్‌లో అతని స్థిరత్వం, ఇన్నింగ్స్‌లను నిలబెట్టగల సామర్థ్యం, ఒత్తిడిలో రాణించే నైపుణ్యం అతన్ని వన్డేలలో అత్యుత్తమ ఆటగాడిగా నిలబెడుతూనే ఉన్నాయి. న్యూజిలాండ్‌తో జ...