భారతదేశం, మే 15 -- వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్ కు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19వ తేదీలోపు వల్లభనేని వంశీని తమ ముందు హాజరు పరచాలని నూజివీడు కోర్టు పోలీసులను ఆదేశించింది.

వల్లభనేని వంశీపై ఇప్పటికే ఆరు కేసులు నమోదు అయ్యాయి. కిడ్నాప్ కేసులో తాజాగా బెయిల్ రాగా...గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో రేపు తీర్పు వెలువడనుంది. ఇప్పటికే ఐదు కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చింది. ఒకవేళ రేపు వంశీకి బెయిల్‌ వచ్చినా ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొంది.

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీని రేపు నూజివీడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో వైసీపీ నేత వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇవాళ నూజి...