భారతదేశం, మే 13 -- వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం వల్లభనేనికి బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్‌ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు ఇచ్చింది కోర్టు.

ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో వంశీ ఇప్పటికే రెండు సార్లు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే కోర్టు రెండు సార్లు బెయిల్‌ తిరస్కరించింది. మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా...ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.

వల్లభనేని వంశీపై... గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, సత్యవర్ధన్‌ కిడ్నాప్‌, బెదిరింపులు...ఇలా మొత్తం ఆరు కేసులు నమోదు అయ్యాయి. ఐదు కేసుల్లో వల్లభనేని వంశీ మోహన్‌ బెయిల్ ...