భారతదేశం, మే 28 -- రుతుపవనాల రాకతో భారత దేశం అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నుంచి దిల్లీ వరకు అన్ని ప్రధాన నగరాల్లో వర్షాల కారణంగా రోడ్లు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల మోకాలి లోతు నీటిలో వాహనాలను నడపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో డ్రైవర్లు అత్యంత దారుణమైన పరిస్థితులకు సిద్ధంగా లేకపోతే తీవ్రమైన భద్రతా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వర్షాకాలంలో బయటకు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖరీదైన మరమ్మతులు, ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు, కారును కాపాడుకోవచ్చు. గుర్తుంచుకోండి లోతైన నీటిలో డ్రైవింగ్ చేయడం కంటే వేచి ఉండటం ఎల్లప్పుడూ సురక్షితం! క్లిష్టమైన పరిస్థితులలో డ్రైవింగ్ చేసేటప్పుడు మీ కారును రక్షించడానికి, మీ సొంత భద్రత కోసం ఈ టిప్స్​ పాటించండి..

నీటిలో మునిగిన రహదారిని చూసినట్లయితే, అది ఎంత పొడవైనదైనా, ఎంత దగ్గరిదైనా వేరే మార్...