Telangana,hyderabad, జూలై 22 -- తెలంగాణలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యావత్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా భారీ వర్షాలు, వ్యవసాయం, ఆరోగ్యం, నీటి పారుదల వ్యవహారాలు, రేషన్ కార్డుల జారీ వంటి అయిదు కీలక అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు. అవసరమైన ఆదేశాలను జారీ చేశారు.

ప్రస్తుత సీజన్‌లో కలెక్టర్లు కచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కీలకమైన అయిదు విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయ...