భారతదేశం, జూలై 4 -- వర్షం పడుతున్నప్పుడు వేడివేడి సూప్ లేదా టీ, కాఫీ లాంటివి తాగడం ఎవరికి మాత్రం నచ్చదు? వానాకాలం అనగానే ముందుగా గుర్తొచ్చేవి ఛాయ్, పకోడీలే అయినా, ఆరోగ్యకరమైన, చిటికెలో తయారు చేసుకోగలిగే స్నాక్స్‌కు కొదవలేదు. వర్షాలు పడుతున్నప్పుడు వాతావరణం బాగున్నా, ఈ సీజన్‌లో చాలామందికి శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం (dehydration) జరగవచ్చు.

ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండాలంటే, శరీరానికి తగినంత నీటిని అందించడం (staying hydrated) చాలా ముఖ్యం. కేవలం సాదా నీరే కాకుండా, సూప్‌లు, స్టూ, మజ్జిగ, పండ్ల రసాలు, నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు.

నిపుణుల సలహా ప్రకారం, మామూలుగా తాగే చక్కెర పానీయాలకు బదులు, ఆరోగ్యకరమైన పానీయాలు, సూప్‌లను తీసుకోవడం మంచిది. చక్కెర పానీయాల్లో కేవలం ఖాళీ కేలరీలు (empty calories) మాత్రమే ఉంటాయి. ఈ వర్షాక...