భారతదేశం, సెప్టెంబర్ 2 -- బెంగళూరులోని అపోలో క్రెడిల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ప్రముఖ కన్సల్టెంట్, రోబోటిక్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ రీతూ చౌదరి... వర్షాకాలంలో గర్భిణీలు సురక్షితంగా, ఆహ్లాదకరంగా ప్రయాణించాలంటే సరైన రవాణా మార్గాన్ని ఎంచుకోవడం, శరీరానికి సరిపడా నీరు అందించడం, శుభ్రమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రయాణం సురక్షితంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఒకవేళ పరిస్థితి విషమిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఆమె హెచ్చరించారు.

డాక్టర్ రీతూ చౌదరి గర్భిణీలకు ప్రయాణంలో ఉపయోగపడే ఎనిమిది ముఖ్యమైన చిట్కాలను పంచుకున్నారు. వాటిలో సరైన దుస్తులు ఎంచుకోవడం నుంచి వాహనంలో కూర్చునే సీటు వరకు పలు అంశాలు ఉన్నాయి.

ప్రయాణం ఖరారు చేసుకునే ముందు మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం తప్పనిసరి. ...