భారతదేశం, అక్టోబర్ 28 -- రష్మిక మందన్నా తన నెక్ట్స్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే ఈ సందర్భంగా Gulte Proకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వర్క్, లైఫ్ బ్యాలెన్స్.. నటీనటులు మరీ ఎక్కువగా పని చేయడం, సరిగా నిద్ర కూడా లేకపోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తమలాగా ఎవరూ అలా మరీ ఎక్కువగా పని చేయొద్దని కోరింది.

రష్మిక మందన్నా కొన్నేళ్లుగా వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంటోంది. ఈ క్రమంలో తనకు రోజూ 8 గంటల నిద్ర అనేది సాధ్యం కావడం లేదని గతంలో కామెంట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

"ఓవర్‌వర్క్ చేయడం అనేది మనం గొప్పగా చెప్పుకోవడం మంచిది కాదు. నేను ఓవర్‌వర్క్ చేస్తాను. కానీ మీరు మాత్రం అలా చేయవద్దని చెబుతాను. ఇది నిలకడగా చేయగలిగినది కాదు. మీకు సౌకర...