Hyderabad, ఆగస్టు 23 -- వరాహ జయంతి అంటే మహావిష్ణువు మూడవ అవతారం అందరికి గుర్తొస్తుంది. రాక్షసరాజు హిరణ్యాక్షుడి దురాగతాల నుంచి భూమిని రక్షించడానికి విష్ణువు వరాహ రూపాన్ని ఇత్తాడు. వరాహ జయంతి మత పరిరక్షణకు చిహ్నంగా మాత్రమే కాదు, విశ్వ సమతుల్యత యొక్క అద్వితీయమైన గాథ. 2025 ఆగస్టు 25న వచ్చే ఈ తేదీ ఎంతో పవిత్రమైనది. ఆ రోజున వరాహ జయంతి. ఆ రోజున విష్ణువుకు పూజలు చేయడం, ఉపవాసం ఉండడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. జీవితంలో స్థిరత్వం, శ్రేయస్సు కలుగుతాయి. మోక్షాన్ని కూడా పొందవచ్చు.

ఈ సంవత్సరం వరాహ జయంతి ఆగస్టు 25న వచ్చింది. భాద్రపద మాసం శుక్లపక్ష తృతీయ నాడు వరాహ జయంతిని జరుపుకుంటాము. ఆ రోజున విష్ణువుని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది.

పంచాంగం ప్రకారం భాద్రపద శుక్ల తృతీయ నాడు వరాహ జయంతిని జరుపుకుంటాము. ఆగస్టు 25న మధ్యాహ్నం 12:35కి తృతీయ ప్రారంభమై, ఆగస్...