Hyderabad, మే 17 -- అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు ఇప్పుడు ప్రపంచంలో అధికంగానే ఉన్నారు. హైబీపీ అదుపులో ఉండకపోతే అనేక రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అధికరక్తపోటును విస్మరిస్తే ప్రాణాంతక వ్యాధులు వచ్చే ఛాన్స్ ఎక్కువ.

హైబీపీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. లేకుంటే రక్తపోటు విపరీతంగా పెరిగిపోయాక బయటపడుతుంది. దీనివల్ల పరిస్థితి చేయిదాటిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి హైబీపీ లక్షణాలు ఏమిటి? దాని బారిన పడిన వారు స్ట్రోక్ రాకుండా ఎలా జాగ్రత్తపడాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

అధిక రక్తపోటు వల్ల వచ్చే అనారోగ్యాల గురించి అవగాహన పెంచడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మే 17 న ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహించుకుంటాం. హై బీపీ అనేది స్ట్రోక్ కు ఎలా కారణమవుతుందో,...