Telangana, సెప్టెంబర్ 4 -- భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం జరిగిన చోట శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరదల వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలను తొలగించేందుకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తామని చెప్పారు.

రోడ్లు, పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానికులతో మాట్లాడారు. కొడంగల్‌కు ఎంత మేరకు సాయం చేస్తానో కామారెడ్డి జిల్లాకు కూడా అంత సాయం చేస్తానని మాటిచ్చారు. వరద నష్టంపై గ్రామాల వారిగా అంచనాలు రూపొందించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. దెబ్బతిన్న రహదారులు, బ్రిడ్జీలు, మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పంట నష్టానికి సహాయం అందిస్తామన్నారు.

ఇటీవల భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవ...