Telangana, ఆగస్టు 28 -- పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా ఆయా ప్రాంతాలను పరిశీలించారు.

వరద ప్రాంతాల పరిశీలన అనంతరం మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సహాయక చర్యలపై పలు ఆదేశాలు జారీ చేశారు. వరద నష్టంపై నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు.

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ హెలికాప్టర్‌లో తొలుత ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకున్నారు. అక్కడ వరద పరిస్థితిని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోచారం ప్రాజెక్టు, పరీవాహక ప్రాంతంతో పాటు హెలికాప్టర్ ద్వారా కామారెడ్డి జిల్లాలోని వరద ప్రాంతాలను పరిశీలించారు.

వరద తీ...